calender_icon.png 5 January, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదు

02-01-2025 10:31:10 PM

40% మెస్సు 200% కాస్మోస్ చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం

విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం ఉండాలి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

మునుగోడు (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు గత ప్రభుత్వం మిస్ కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని కాంగ్రెస్ ప్రభుత్వం 40% శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే యేసు నామకరణ ఉత్సవాలలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం నియోజకవర్గం మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ గురుకుల బాలికల, చండూరు మండలంలోని  బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించి, క్లాస్ రూమ్ లో విద్యార్థుల సంఖ్యను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. మేము అన్ని సమకూరుస్తాం మీరు బాగా చదువుకోవాలి, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వంట చేసే పాత్రల్ని మార్చాలి, అన్ని గురుకులాలలో టీచింగ్ స్టాఫ్, హాస్టల్ స్టాఫ్, ప్రత్యేకంగా వేరువేరుగా ఉండాలని సూచించారు. టీచింగ్ స్టాఫ్ కే హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చెప్పడం వల్ల విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు, విద్యార్థులు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు. పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా కొన్ని మార్పులు సూచనలు చేశారు.

ఐదవ తరగతి నుండి అమ్మ నాన్నలను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి చదువుకుంటున్న మీకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం అందించడం మాపైన మా ప్రభుత్వంపైన ఉందని అన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో గురుకుల పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు జక్కలి శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.