అమెరికా నోస్ట్రడామస్ లిచ్‌మన్
వాషింగ్టన్, జూలై 30: ఎన్నడూ లేన్ని మలుపులు తిరుగుతూ హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై నిత్యం అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ, అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ నోస్ట్రడామస్‌గా పేరు గడించిన ఎన్నికల విశ్లేషకుడు ప్రొఫెసర్ అలెన్ లిచ్‌మన్ ఏం చెప్తారన్నదానిపైనే ఉన్నది. ఎందుకంటే ఆయన గత 9 అధ్యక్ష ఎన్నికల్లో చెప్పిన జోస్యం పొల్లుపోకుండా నిజమైంది మరి.
తాజాగా ఆయన ప్రాథమిక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఉన్న బలాబలాలను చూసుకొంటే అమెరికా అధ్యక్ష పీఠంపై తొలిసారి ఓ మహిళ కూర్చోబోతున్నట్టు ప్రకటించారు. డెమోక్రాట్ల అభ్యర్థిగా లీడ్‌లో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గెలుస్తారని అంచనా వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలను అంచనా వేసేందుక లిచ్‌మన్ ప్రత్యేకంగా ‘కీ టు ది వైట్ హౌస్’ అనే ఫార్ములాను రూపొందించారు. ఇందులో 13 అంశాలు ఉంటాయి.