- ఎయిర్ఫోర్స్ అకాడమీ మాజీ, ప్రస్తుత కమాండెంట్లకు అందజేత
హైదరాబాద్ , జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్ ఎయిర్ఫోర్స్ అకాడమీ మాజీ కమాండెంట్ చంద్ర శేఖర్, ప్రస్తుత కమాండెంట్ శ్రీనివాస్ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో శనివారం జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో విశిష్ట సేవలు అందించిన మాజీ, ప్రస్తుత కమాండెంట్లు 94మందికి ఈ పురస్కారాలను అందజేశారు. వారిలో హైదరాబాద్ నుంచి చంద్ర శేఖర్, శ్రీనివాస్ ఉన్నారు.