13-02-2025 01:53:42 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, మల్టీపుల్ రాష్ట్రాలలో జేఈఈ ఫలితాలలో తమ సత్తాను చాటారని డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ తెలిపారు.
జేఈఈలో 300/ మార్కులు సాధించి 100 పర్సంటైల్ సాధించిన భణి బ్రాత మాజీ (తెలంగాణ), అ షింగాల్ (రాజస్థాన్), కుషాగ్రా గుప్తా (కర్నాటక), విషాద్ జైన్ (మహారాష్ట్ర), శివేణ్ వికాస్ తోష్నీవాల్ (గుజరాత్), పి దాస్ (పంజాబ్), అర్నల్ జిందాల్ (చండీఘర్), సన్నీ యాదవ్ (తమిళనాడు) లను నారాయణ డైరెక్టర్లు సింధూర నారాయణ, పి. శరణి నారాయణలు అభినందించారు.