calender_icon.png 27 November, 2024 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ జీడీపీలో పౌల్ట్రీ పరిశ్రమ కీలకం

27-11-2024 01:47:34 AM

పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘెష్

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశ జీడీపీలో పౌల్ట్రీ రం గం కీలకమైన రంగంగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి సభ్యసాచీ ఘోష్ పేర్కొన్నారు. మంగళవారం హెచ్‌ఐఐసీలో పౌల్ట్రీ ఇండియా సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ తెలంగాణలో పౌల్ట్రీ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు.

పరిశ్రమలో ఉత్తమ పద్ధతులను అవలంభించుకోవడం, నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఖర్చుల నిర్వహణను మెరుగుపరచుకోవడం అవసరమని సూచించారు. ఈ పరిశ్రమలో, పరిశోధనలు,  టెక్నాలజీ మార్గ దర్శకాలను అందించే గొప్ప వేదికగా పౌల్ట్రీ ఇండియా సదస్సు నిలుస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమం దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక  ఉత్సవమని, ఇది దేశ, విదేశీ ఉత్పత్తిదారులు  పౌల్ట్రీ పరికర తయారీదారులను ఏకరూపం చేస్తున్నదన్నారు. ఈ వేడుకలలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.