calender_icon.png 3 February, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేల గొంతులు.. లక్ష డప్పుల గోడ ప్రతులు ఆవిష్కరణ

03-02-2025 07:05:05 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వేల గొంతులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. పట్టణంలోని మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం లక్ష డప్పులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు జీడి సారంగం మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీఎస్ దళపతి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదులో జరిగే మాదిగ భారీ సాంస్కృతిక ప్రదర్శనలో మాదిగలు, మాదిగ ఉపకులస్తులు, వర్గీకరణ లక్ష్యాన్ని సాధించడానికి పెద్ద ఎత్తున పాల్గొనీ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపెల్లి ఓదెలు, మిట్టపల్లి బాపు, సప్పిడి శ్రీనివాస్, కంబాల రాజనర్సు, దాసరి రాజనర్సు, ఉప్పులేటి నరేష్, ఇరుగురాల వెంకట్, మంతెన సుమన్, కాంపెల్లి శ్రీనివాస్, శనిగారపు రాజ్ కుమార్, చొప్పదండి స్వామీ మాదిగలు  పాల్గొన్నారు.