- * చట్టసభల నియమాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుసుకోవాలి
- * గాలివాటం రాజకీయాలతో కొత్తవాళ్లు మళ్లీ గెలవడం లేదు
- * శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ‘ప్రజా ప్రతినిధి పదవి అనేది మహోన్నతనమైనది. అందరికీ ఈ పదవి దక్కదు. అదృ ష్టం ఉన్న వారికి మాత్రమే దక్కుతుంది. గత పదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎప్పు డూ శిక్షణ తరగతులను నిర్వహించలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వహించుకుంటు న్నాం’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు ఓరియంటేషన్ ప్రోగ్రాంను మండలి చైైర్మన్ గుత్తా, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌లు బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. లేజిస్లేచర్‌కు సంబంధించిన పుస్తకాలను ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చదివి చట్టసభలకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
119 ఎమ్మెల్యేల్లో 57 మంది నూతనంగా ఎన్నికైన వారేనని.. వారంతా కచ్చితంగా ఈ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల మనసుల చదివితేనే ప్రజా ప్రతినిధులు అవుతారని, ఈ ఐదేళ్లు ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్‌లో గెలుస్తామన్నారు. ‘ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది.
సామాన్యుడు కూడా పోటీ చేసేవిధంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహ జం. భయపడకుండా ప్రతి విమర్శతో ముం దుకెళ్లాలి’ అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. గాలివాటం రాజకీయాలు మొదలైనప్పటి నుంచి కొత్తవాళ్లు మళ్లీ గెలవడం లేదని.. మొదటిసారి గెలిచిన వారిలో 25శాతం మందే సక్సెస్ అవుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు ఫోన్లు దగ్గర పెట్టుకోవాలని, ఎవరైనా ఫోన్ చేస్తే నేరుగా మాట్లాడాలి అని సూచించారు. ‘నేను ఒకసారి ఓడిపోవడానికి సెక్యూరిటీ సమస్యే కారణమైంది. ప్రజలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరం కావడానికి పీఏలు, పీఆర్వోలే కారణం’ అని మండలి చైర్మన్ పేర్కొన్నారు.
ఏటా ఉత్తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవార్డులు
*అసెంబ్లీ అందరిది
*శాసనసభ వ్యవహారాలమంత్రి శ్రీధర్‌బాబు
‘గత పదేళ్లలో ఇ లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. లెజిస్లే చర్ మీటింగ్‌తో పా ర్టీలకు ఎలాంటి సం బంధం లేదు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవ డం శోచనీయం. ఈ తరగతులను వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేస్తు న్నాం’ అని శాసనసభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు కోరారు. వివిధ పార్టీల కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా.. అసెంబ్లీ అందరిదని మంత్రి పేర్కొన్నా రు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా.. సభలో ఎవరి పాత్ర వా రు పోషించే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేందరూ శాసనసభకు హాజరయ్యే సం ప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. పార్లమెంటేరి యన్ తరహాలో అసెంబ్లీ, శాసనమండలిలోనూ ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులను ప్రతి ఏటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈసారి సభలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 57 మంది ఉన్నారని తెలిపారు.