10-03-2025 09:07:45 PM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ముషీరాబాద్ తహసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ... ప్రభుత్వం కల్పించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల కోసం పేదలు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ, కవాడిగూడ బీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, నాయకులు శివ ముదిరాజ్, మాధవ్, శ్రీనివాస్ గుప్తా, గోరఖ్నాథ్, మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ యాదవ్, మారిశెట్టి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.