calender_icon.png 11 January, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి..

10-01-2025 08:44:12 PM

లబ్ధిదారులకు 197 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కుల పంపిణీ.. 

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్(MLA Muta Gopal) అన్నారు. ఈ మేరకు శుక్రవారం లోయర్ ట్యాంక్బండ్ లోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తాహసిల్దార్ చందన, ముషీరాబాద్, కవాడిగూడ డివిజన్ ల కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, గోడ్చల రచన శ్రీ లతో కలిసి ముషీరాబాద్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు 197 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, బిజెపి సీనియర్ నాయకుడు నవీన్ గౌడ్, బీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.