గజ్వేల్, జూలై 11: గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పేదలకు వెంటనే డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేయడంతో పాటు మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాలు, ప్యాకేజీలను అందజేయాలని బీజేపీ గజ్వేల్ పట్టణాధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించి ఏడేళ్లు పూర్తయినా గజ్వేల్‌లో పేదలకు పంపిణీ చేయకుండా మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. 5 వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 1250 మాత్రమే నిర్మించి, 1100 ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించారని తెలిపారు. కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు అయిల మహేందర్, మంద వెంకట్, నాయిని సందీప్, శివకుమార్, శేఖర్, సుమతి తదితరులు పాల్గొన్నారు.