వెంకటేశ్, అనిల్ రావిపూడి కొలాబరేషన్‌లో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఆది నుంచి సినిమాకు హైప్ తీసుకు రావడంలో మేకర్స్ వినూత్నంగా యత్నిస్తున్నారు.
సోమవారం చిత్రానికి సంబంధించిన మూడో పాట, పొంగల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాన్సెప్ట్ వీడియోతో ఈ పాటకు కావల్సినంత హైప్ తీసుకొచ్చారు. మొత్తానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన పొంగల్ సాంగ్ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటను వెంకటేశ్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఆలపించారు.
సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలను, పొంగల్ వేడుకలను అద్భుతంగా ఈ పాటలో చూపించారు. వెంకటేశ్, ఇద్దరు హీరోయిన్లు సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.