- అక్రమ నిర్మాణాల కూల్చివేతలకే పరిమితం కావొద్దు
- బెంగళూరులో హైడ్రా బృందానికి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ సూచనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవం కోసం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికే పరిమితం కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చెరువులను పునరుద్ధరించేం దుకు హైడ్రా చర్యలు చేపట్టాలని లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ అన్నారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు హైడ్రా అధికా రులు బెంగళూరు పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగం గా రెండో రోజు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కేటీసీడీఏ) అధికా రులతో ప్రత్యేక సమావేశమయ్యారు.
దొడ్డతోగూరు చెరువును సందర్శించి, కేటీసీడీఏ సీఈవో రాఘవన్, కేటీసీడీఏ డైరెక్టర్ బీకే పవిత్ర, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌లతో చెరువుల పరిరక్షణ, పునరుద్ధర ణపై చర్చిం చారు. ఈ సందర్భంగా నాలుగైదు దశలలో ప్రకృతి సహజ సిద్ధంగా మురుగు నీటిని శుద్ధి చేసి మెయిన్ చెరువులోకి పంపించే తీరును ఆనంద్ మల్లిగవాడ్ హైడ్రా బృందానికి వివరించారు.
కేటీసీడీఏ సీఈవో రాఘవన్‌తో జరిగిన సమా వేశంలో కేటీసీడీఏ యాక్ట్ 2004ను హైడ్రా బృందం పరిశీలించింది. ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్ జోన్‌లో ఉన్న మొత్తం భూమిని ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తామని ఈ సందర్భంగా రాఘవన్ తెలి పారు.
ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణ చేసే విధానాన్ని, డీపీఆర్ రిపోర్టు తయారు చేసిన దగ్గరి నుంచి చెరువుల సుందరీకరణ దాకా పనితీరును విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యునస్ ఫయాజ్ హైడ్రా బృందానికి వివరించారు.