calender_icon.png 22 January, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు వెలవెల.. రైతులు విలవిల

26-08-2024 03:04:00 AM

  1. సూర్యాపేట జిల్లాలో అలుగు పారని చెరువులు 
  2. 1225 చెరువుల్లో అలుగుపారింది ఐదే 
  3. వర్షాభావానికి తోడు ఆక్రమణలు 
  4. చెరువు నిండకపోవడానికి కారణం 
  5. ఆదుకుంటున్న బోరుబావులు

సూర్యాపేట, ఆగస్టు25(విజయక్రాంతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు చెరువు కాల్వలు (వరద కాల్వలు) కబ్జాలకు గురికావడంతో నీరు లేక చెరువులు వెలవెల పోతున్నాయి. వర్షాకాల ం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా జిల్లాలో 90 శాతం చెరువులు, కుంటల్లో సగానికి కూ డా నీరు చేరలేదు. జిల్లాలో ఇప్పటివరకు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రమే వరి సాగు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వరి సాగు భారీగా తగ్గే అవకాశం ఉన్నది. ఇప్పటిరకు జిల్లాలో సాధారణ వర్షాపాతం మాత్రమే నమోదైంది. 

జిల్లాలో 1,225 చెరువులు..

సూర్యాపేట జిల్లాలో మొత్తం 1,225 చెరువులు ఉన్నాయి. వీటి కింద 69,385 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇందులో 532 చెరువుల్లో 25 శాతం మేరకు మాత్రమే నీరు  ఉండగా 543 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నీరు చేరింది. ఇక 103 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, మరో 42 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరాయి. కేవలం 5 చెరువులు మా త్రమేపూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతున్నట్లు అధికారుల గణాంకా లు చెబుతున్నాయి. అనుకున్న స్థాయిలో వ ర్షాలు పడకపోవడంతో చెరువులు వెలవెల పోతున్నాయి.

సూర్యాపేట, తుంగతుర్తి ని యోజకవర్గాలలో ఎక్కువగా చెరువులు ఉ న్నాయి. ఇక్కడ ఉన్న 967 చెరువులు నిండాలంటే  ప్రస్తుత పరిస్థితిల్లో ఎస్సారెస్పీ కాలు వలపై ఆధారపడడం తప్పనిసరిగా మారిం ది. అదేవిధంగా ఎన్‌ఎస్‌పీ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో హుజుర్‌నగర్, కోదాడ  నియోజకవర్గాలలోని కొన్ని మండలాల్లో చెరువులు నిండే అవకాశం ఉన్నది. జిల్లాలో చెరువుల కింద ఆయకట్లు లెక్కలు తక్కువగా చూపుతున్నారు. చెరువుల్లో నీరు చేరితే బో రుబావుల ద్వారా నీరు అందే అవకాశం ఉం ది. అయితే చెరువులు నిండకపోవడంతో సా గుపై ప్రభావం చూపుతోంది. 

వర్షాభావానికి తోడు ఆక్రమణలు..

ఈ ఏడాది జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా జూలైలో లోటు వర్షపాతం నమోదైనది.  మళ్లీ ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదైనా 90 శాతం చెరువుల్లో  సగం కన్నా తక్కువగా నే నీరు చేరింది.  ఈ పరిస్థితి గత 8 సంవత్సరాల క్రితం ఉండేది. చెరువులు నిం డకపోవడానికి తక్కువ వర్షాలు పడటం ఒక కారణ మైతే, నీరు చేరే కాల్వలు కబ్జా కు లోనవ్వడం మరో కారణమని చెప్పవ చ్చు. గత పదేండ్లలో భూములకు విలువ పెరగడంతో కొం దరు అక్రమార్కులు చెరువు కాల్వలను కబ్జా చేసి పంట పొలా ల్లో కలుపుకున్నారు. అధికారులు లెక్క ల్లో వరద కాల్వలు ఉన్నట్లు చూపుతున్నా  క్షేత్రస్థాయిలో మాత్రం అవి కనుమరుగైనాయి. 

ఎస్సారెస్పీ, ఎన్‌ఎస్‌పిపైనే ఆశలు..

జిల్లాలో  పంటల సాగు కోసం ఎస్పారె స్పీ, ఎన్‌ఎస్‌పీ కాలువలపైనే రైతులకు ఆశ లు ఉన్నాయి. కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాలలో ఎన్‌ఎస్‌పీ కాలువలకు ఇటీవల నీటిని విడుదల చేశారు. లిఫ్ట్ ఇరిగేషన సిస్ట మ్ ద్వారా ఆయా నియోజకవర్గాల రైతుల కు సాగు నీరు అందించేందుకు ఏర్పా టు చే శారు. నాగార్జున సాగర్ నిండటంతో ఈ ప్రా జెక్ట్ కాలువ కింద ఉన్న చెరువులు నిండే అ వకాశం ఉంది. కానీ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల రైతులకు నీరు అందిచే ఎస్సారెస్పీ కాలువకు నేటికి నీటి విడుదల జరుగలేదు. ఎప్పుడు నీరు విడుదల చేస్తార నే విషయంపై స్పష్టత కూడా లేదు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే ఈ రెండు నియోజకర్గాలలో చెరువులు నిండే అవకాశం ఉన్నది. చెరువులు నిండితే రైతులకు రెండు సీజన్లలో పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నది.