calender_icon.png 15 April, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు మరమ్మతు చేపట్టాలి

08-04-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామస్తులు సోమవారం మహబూబాబాద్ - తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ స్తులు, రైతులు మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి నెలలు గడుస్తున్న మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని ప్రజలను, రైతులను శాంతింపజేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో ఆందోళన విరమించారు