calender_icon.png 10 January, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 గ్యారెంటీల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కేటీఆర్ పై కేసుల రాజకీయం

09-01-2025 06:00:03 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజలకు ఆరు గ్యారెంటీలు అందిస్తామని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ అరెస్టు అంటూ కొత్త నాటకాన్ని తరలేపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న(BRS Party Adilabad District President Jogu Ramanna) ద్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండల నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు కొమ్ముకాస్తు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే వారికి సమస్యలను పక్కనపెట్టి తన భూములు కబ్జా చేస్తూన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల నుండి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.