24-02-2025 10:50:57 PM
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ వంటివని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో పర్యటించిన ఆయన బీసీ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఆయన్ని శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం మొదలైందని అన్నారు.
బీసీలకు టికెట్ ఇవ్వని పార్టీలు అవసరం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం, బీసీల్లో రాజకీయ చైతన్యం చూసి ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు బెంబేలెత్తిపోతున్నాయని పేర్కొన్నారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా బీసీ ల విజయమే ఖాయమని అన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలు, సంఘాలు మనకు అవసరమా అని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలలా శ్రీనివాస్ తో పాటు పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.