06-03-2025 12:54:10 AM
* గ్రూపు తగాదాలతో అధికారులకు ఒత్తిళ్లు
* ఎట్టకేలకు ఉన్నత అధికారులకు ఫిర్యాదు
పెన్ పహాడ్, మార్చి 5: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని భక్తళాపురం గ్రామకంఠంలోని ఎస్సీ కమ్యూనిటీహాల్ కు సమీపంలో ఉన్న సుమారు 2గుంటల గ్రామకంఠం భూమి లొల్లి రాజకీయం పురుముకుంది. ఈ గ్రామకంఠం స్థలంలో పక్కనే ఉన్న నెమ్మది వెంకటమ్మ ఈభూమిని గత కొన్ని యేండ్లుగా పశువుల దొడ్డిగా, వ్యవసాయ పనిముట్లు పెట్టుకొంటుంది.
అయితే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 2021లో పల్లె ప్రగతిలో భాగంగా ఈ స్థలంలోనే పెంటదిబ్బలు, పిచ్చిమొక్కలు ఉంటే చదును చేశారు. ఆ సమయంలో సదరు భూమిని ఆక్రమించిన నెమ్మాది వెంకటమ్మకి పంచాయతీ కార్యదర్శి నోటీస్ అందజేశారు. ఆ తర్వాత 2023లో ఈస్థలంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన బిల్డింగు ఏర్పాటుకు శిలాఫలకం వేయడానికి సన్నాహాలు చేశారు. అట్టి కార్యక్రమము వాయిదా పడిం ది.
అప్పటి నుంచి వెంకటమ్మ ఈస్థలం ఖాళీగా ఉండడంతో తిరిగి ఆక్రమించుకున్నదని గ్రామస్థులు పెర్కొంటున్నారు. కాగా ఇటీవల వెంకటమ్మ ఈస్థలం చుట్టూ పరదాలాంటిది ఏర్పాటు చేసి ఏకంగా రేకుల ఇంటిని నిర్మాణం చేపట్టింది. ఈ విషయం తెలిసిన పంచాయతీ కార్యదర్శి శివ పలుమార్లు నోటీసులు జారీ చేస్తున్నప్పటికి నోటీసులు తీసుకోక పోవడంతో ఇంటికి అతికించారు.
ఇదంతా గ్రామములోని పలు పార్టీల నాయకులు రెండు వర్గాలుగా ఉండ గా ఒకరు మద్దతు, మరొకరు వ్యతిరేకంగా సపోర్టు చేయడంతో వెంకటమ్మకు ఇదే గ్రామములో పాలివార్ల మధ్యన లొల్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ గ్రామములో ఎస్సీ కాలనీలో నిర్మించుకున్న ఇండ్లన్నీ అందరూ ఆక్రమించుకున్నవారేనని .. తాను తన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని జీఓ నెం.58 ,59 ప్రకారం ఆక్రమించుకుంటే తప్పేంటని వాదనలు, ప్రతి వాదనలు అలుముకున్నాయి.
పూర్వం ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తన తాతల ఇదే ఆస్తిని దారదత్తం చేస్తే ఎవరో వచ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోమని.. గ్రామ పంచాయతీ వినియోగించుకోకుండా నిరుపయోగంగా ఉంచారని.. మాతాతల ఆ స్థలం మాకే చెందుతదని గ్రామానికి చెందిన నెమ్మది రఘుతో పాటు మరికొందరు కలసి సూర్యాపేట ఆర్డీఓ, తహాసీల్దారులకు వినతి పత్రాలు అందజేశారు.
అయితే ఈ గ్రామములో మరో 10గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. ఇంటి స్థలాలు లేని వారు ఆక్రమించుకోవచ్చని కొందరు నాయకులు గ్రామస్థు లకు కితాబు ఇస్తున్నారు. గ్రామములో రాజ కీయం పురుముకోవడంతో ఈ స్థలాల లొల్లి ఎక్కడికి దాక వెళ్ళుతుండో వేచి చూడాలి.
ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తా: పంచాయతీ కార్యదర్శి శివ ఈవిషయంమై ఉన్నత అధికారులకు పూర్తి నివేదిక అందజేస్తా. గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి, నాహాయంలో పలు మార్లు ఈస్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ జేశాను. స్థలం చుట్టు పరదాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నోటీస్ ఇచ్చా. పలు పార్టీ నాయకుల వత్తిడి ఉన్నా విషయంపై ఉన్నత అధికారులకు తెలియజేస్తా.