మహేశ్వరం (విజయక్రాంతి): మహేశ్వరం డీసీపీ యూనిట్, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా పలు వ్యాపార దుకాణాలపై దాడి చేసి అందులో పని చేస్తున్న ఏడుగురు బాల కార్మికులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోపాన్ షేక్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహారిస్తూ కోల్‌కత్తా నుంచి పలువురు పిల్లలను తీసుకువచ్చి న్యూ బాబా నగర్‌లో పలు చిరు వ్యాపారుల వద్ద కార్మికులకు పనికి పెట్టించినట్లు విచారణలో గుర్తించారు. పోలీసులు ఏడుగురు చిన్నారులకు విమూక్తి కల్పించి సీడబ్ల్యూసి సూచన మేరకు రక్షణ కల్పించారు. ఈ దాడిలో రెండు దుకాణాల వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. ఏవరైన దుకాణాలలో లేదా ఇతర వ్యాపారాల్లో చిన్నారులను పనికి పెట్టుకుంటే చట్టాపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.