calender_icon.png 20 February, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు వాహనం చోరీ...!

17-02-2025 10:34:13 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పోలీస్ అధికారి ద్విచక్రవాహనం చోరీకి గురైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పోలీసు అధికారి రాజవర్ధన్ రెడ్డి ఆదివారం సాయంత్రం జడ్పీ మైదానంలో జరిగిన సగర శంఖారావం కార్యక్రమానికి విధుల్లో భాగంగా హాజరయ్యారు. టిఎస్ 09 పిఏ 2442 నెంబర్ గల తన ద్విచక్ర వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద నిలిపి లోపలికి వెళ్లి సభ ముగిశాక వచ్చి చూసేసరికి వాహనం మాయమైంది. పలు ప్రాంతాల్లో వెతికి చూసినప్పటికీ కనిపించకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.