మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు పోలీసులు ఎట్టకేలకు తప్పిపోయిన బాలుని ఆచూకీ ఛేదించి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మండల కేంద్రంలోని మార్కొండయ్య వార్షికోత్సవాల సందర్భంగా కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అదే కార్యక్రమంలో తప్పిపోయిన విషయములో మైనర్ బాలుని తల్లి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి, బుధవారం సాయంత్రం నుండి చండూర్ సి.ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టి, గురువారం సిఐ వారి సిబ్బందితో కలిసి ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతకగా ఇంటి ప్రక్కన గల వట్టికోటి నర్సింహా ఇంటిపైన మైనర్ బాలుడు ఆచూకీ లభించడంతో బాలుని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఇట్టి విషయములో కె. శివరాంరెడ్డి డి.ఎస్.పి నల్గొండ చండూర్ సిఐ వెంకటయ్యను, మునుగోడు పోలీస్ సిబ్బందిని అభినందించారు.