హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): కొత్తపేట ప్రాంతంలో నివాసముంటున్న తనభర్త ప్రసన్న రాజును గురువారం తెల్లవారుజామున సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు తీసుకెళ్లారని విజయలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) మానవ హక్కుల వేదికకు తెలిపారు.
ఏ పోలీసు స్టేషన్‌కు చెందిన వారో, ఎక్కడకు తీసుకెళ్తున్నారని అడిగినా వారు సమాధానం ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. తన భర్త బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడని.. ఆయనపై ఇప్పటివరకు ఏ కేసులూ లేవని.. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.