ఇరువురిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పరీక్షకేంద్రానికి అభ్యర్థులను సమయనికి చేర్చి వారి పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు సహకరించిన పోలీస్ అధికారుల తీరు మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. దీంతో పలువురు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు, మఫ్టీలో ఉన్న ఏఎస్ఐ, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ల ఔదార్యం చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్-3 పరీక్ష రాసెందుకు వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష సమయానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉండటంతో పరుగులు పెడుతూ కేంద్రం సమీపంలో చేరుకొని, నీరసంతో కేంద్రానికి పది అడుగుల దూరంలో కింద పడబోతుండగా ఆపన్నహస్తంలా మఫ్టీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ వెంకట్రములు ఆమెను కిందపడకుండా వెంటనే అప్రమత్తమై ఆమెని కింద పడకుండా కాపాడారు.
మరోవైపు పరీక్ష కేంద్ర గేట్లు మూసివేస్తుడంతో ఆమెను కేంద్రంలో పంపించి మహిళా పోలీస్ లతో మంచినీటిని అందించారు. మరో అభ్యర్థిని కూడా ఒక పరీక్ష కేంద్రానికి బదులు ఇంకో పరీక్షా కేంద్రానికి వచ్చి టెన్షన్ పడుతుంటే అది గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య HC1369 సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చడం జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం అయిన ఆ అభ్యర్తులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయెవారు, పరీక్షా కేంద్రం లోపలి వెళ్ళిన ఒక నిమిషం తేడాతో అధికారులు గేట్లు మూసివేయడం జరిగింది. 9.30 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. కాఠిన్యం మాటున కరుణ దాగి ఉంటుందని ఈ ఘటన కళ్లకు కట్టింది. వీరి ఇరువురి సేవలు ప్రశంసనీయమైనవి. అభ్యర్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సహాయ చర్యలు అత్యంత ముఖ్యమైన అంశమని పలువురు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ వెంకత్రములు, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, జిల్లా ఎస్పీ డి జానకి ప్రత్యేకంగా అభినందించారు.