నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన గోదావరి అనే వివాహితను గురువారం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కల్లూరు గ్రామనికి చెందిన గోదావరి భర్త వెంకటేష్ ఐదు రోజుల క్రితం గొడవ పడి ఇంటి నుండి ఐదు సంవత్సరాల బాబుతో వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా లోకేశ్వరం పోలీసులు లోకేశ్వరం మండలంలోని గోదావరి వద్ద ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించి పట్టుకొని అప్పగించినట్లు తెలిపారు. వివాహితను కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించిన లోకేశ్వరం పోలీసులకు జిల్లా ఎస్పీ జానకి అభినందనలు తెలిపారు.