calender_icon.png 5 November, 2024 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖదే కీలకపాత్ర

05-11-2024 03:23:34 AM

శాంతి భద్రతల అమలులో రాజీపడొద్దు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం ప్రారంభం

సూర్యాపేట, నవంబర్ 4 (విజయక్రాం తి): ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖదే కీలకపాత్ర అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు రాజీ పడవద్దని సూచించారు. వసతుల కల్పనకు ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన అనంతగిరి, చింతల పాలెం, పాలకవీ డు, మద్దిరాల, నాగారం పోలీస్‌స్టేషన్‌లకు భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూ రు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవి, ఐజీ రమేష్‌రెడ్డి, పోలీస్ హౌజింగ్ ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. 

ప్రతి ధాన్యపు గింజను కొంటాం

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతుల నుంచి ప్రతి గింజను సేకరించాలనే లక్ష్యంతోనే ప్రభు త్వం రూ.20 వేల కోట్లు కేటాయించిందన్నారు. 7,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా సంక్రాంతి తర్వాత సన్నబియ్యం ఇస్తామని మంత్రి తెలిపారు.

ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తిచేయాలి

సూర్యాపేట, నవంబర్ 4 (విజయక్రాంతి)/కోదాడ: జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో కోదాడ పట్టణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముక్త్యాల, జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకాల పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. శాంతినగర్‌లో నిర్మించ తలపెట్టిన పద్మావతి ఎత్తిపోతల పథకం పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓ రైతు ఆర్9 లిఫ్ట్ పంపు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకరాగా, వెంటనే సమస్య పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ నీరు మోతె, నడిగూడెం, మునగాల మండలాలకు సాగునీరు వచ్చేలా చూస్తానని భరోసా కల్పించారు. గత 25 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథకాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం కల్పించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. ఏ పదవిలో ఉన్నా నిరంతరం ప్రజల సేవ కోసమే పనిచేస్తామని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీఈ రమేష్, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు పాల్గొన్నారు.