calender_icon.png 22 April, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంబాబు కుటుంబాన్ని పోలీసు శాఖ అన్ని విధాల ఆదుకుంటుంది

22-04-2025 06:15:34 PM

జిల్లా ఎస్పి నరసింహ..

మునగాల: సోమవారం రాత్రి మునగాల పోలీస్ స్టేషన్ పరిధి ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ రాంబాబు భౌతికకాయానికి ప్రభుత్వ హాస్పిటల్ నందు పూలమాల వేసి పోలీస్ శాఖ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... రాంబాబు మరణించడం చాలా బాధాకరం అన్నారు. దహన సంస్కారాల నిమిత్తం కానిస్టేబుల్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా, పోలీసు శాఖ ద్వారా రావలసిన అన్ని రకాల ఆర్థిక తోడ్పాట్లను, ప్రభుత్వ సహాయంతో అందించే కారుణ్య నియామక ఉద్యోగం త్వరగా వచ్చేలా కృషి చేస్తాం అన్నారు.

పోలీసు సిబ్బంది విధులు నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, విధులలో అలసిపోతే కాస్త విశ్రాంతి తీసుకోవాలని, విశ్రాంతి అనంతరం ప్రయాణాలు చేయడం మంచిదని అన్నారు. రాత్రి వేళ సొంత వాహనాలపై ప్రయాణం చేయకపోవడం మంచిది అన్నారు. పోలీసు సిబ్బంది అందరూ సాలరీ బ్యాంక్ అకౌంట్ కు పోలీస్ సాలరీ ప్యాకేజీ తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్, కోదాడ ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, పోలీసు సిబ్బంది, మృతుని బంధువులు పాల్గొన్నారు.