calender_icon.png 23 October, 2024 | 10:01 PM

అవినీతి కూపంలో పోలీసు శాఖ

15-07-2024 12:50:20 AM

ఏసీబీకి చిక్కుతున్న మెదక్ పోలీసులు

అక్రమార్కులకు అండగా ఖాకీలు

మెదక్, జూలై 14(విజయక్రాంతి): కొంద రు అవినీతి అధికారుల వల్ల మెదక్ జిల్లాలో పోలీసుశాఖ అభాసుపాలవుతుంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పోలీసు అధికారులు దొరుకుతున్న ఘటనలే ఇందుకు  నిదర్శనం గా నిలుస్తున్నాయి. రియల్ వ్యాపారులకు, ఇసుక, మట్టి మాఫియాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు జిల్లా లో వినిపిస్తున్నాయి. ఇటీవల ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని వదిలేయడానికి లంచం డిమాండ్ చేసిన ఘటనలో మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సురేందర్‌ను మార్చి 19న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఈ కేసులో ఎస్‌ఐ అమర్, రైటర్ పాషా ప్రమేయం ఉన్నదని ఏసీబీ దర్యాప్తులో తేలడంతో ఎస్‌ఐతోపా టు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ దాడిని మరవ కముందే తాజాగా హవేళీఘణపూర్ ఎస్‌ఐ అరవింద్‌గౌడ్ ఇసుక టిప్ప ర్ రిలీజ్ కోసం రూ.50వేల లంచం డిమాండ్ చేయగా, రూ. 30 వేలు ఒప్పందం చేసుకొని మధ్యవర్తి మ స్తాన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. 

దందాను బట్టి రేటు?

జిల్లాలో అక్రమార్కులకు అండగా పోలీసు శాఖ నిలుస్తోందనే ఆరోపణలున్నాయి. దందాను బట్టి  రేటును నిర్ణయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వ్యాపారాన్ని బట్టి ఆయా పోలీస్ స్టేషన్ అధికారు లు నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఇసుక, మట్టి, మొరం అ క్రమంగా తరలించే వారు పోలీసుల జేబు తడపాల్సిందేనని వినికిడి. రియల్ వ్యాపారుల నుంచి కూడా భారీ స్థాయిలో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. 

కొత్త ఎస్పీకి సవాల్‌గా మారనుందా?

మెదక్ జిల్లా నూతన ఎస్పీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించా రు. మెదక్ జిల్లా పోలీసు శాఖను ఏ విధంగా ప్రక్షాళన చేస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అవినీతికి పాల్పడుతున్న అధి కారులపై ఉక్కుపాదం మోపుతారా లేదా అనేది వేచిచూడాల్సిందే.

ఉన్నతాధికారుల ఒత్తిళ్లే కారణమా ?

పోలీసు అధికారుల అవినీ తి రాజ్యమేలడానికి ఉన్నతాధికారుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తున్నది. పోలీసు స్టేషన్లలో అధికారులు తీసుకునే ముడుపు లు స్థాయిని బట్టి పంపకాలు జరుపుతారనే విమర్శలున్నాయి. పైస్థాయి అధికా రులకు నెలావారీ ముట్టజెప్పుతారన్న ఆరోపణలున్నాయి. ముడుపులు అప్పగించని పోలీస్ స్టేషన్‌లపై ఉన్నతాధి కారుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలుస్తున్నది. తెరవెనుక ఉన్నతాధికారు ల హస్తం ఉన్నప్పటికీ కిందిస్థాయి ఉ ద్యోగులే బలవుతున్నారన్న విమర్శలున్నాయి. ఓ ఉన్నతాధికారి ప్రమేయం తోనే జిల్లాలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నాయని, తనకు ముడుపులు అప్పగించని వారిపై నజర్ పెట్టి ఏసీబీకి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.