calender_icon.png 20 January, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారుడిని చితకబాదిన పోలీసులు

05-07-2024 12:20:24 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి):  న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. ఈ ఘటన  సైదాబాద్ పీఎస్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. సైదాబాద్ సింగరేణి కాలనీలో రాంసింగ్ అనే వ్యక్తి కుటుంబం చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగి స్తోంది. రెండు నెలల క్రితం రాంసింగ్ భార్యకు పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. ఏం జరిగిందో కానీ అదే రోజు రాత్రి ఆమె మృతిచెందింది. దీంతో తన భార్య మృతికి పక్కింటి వాళ్లే కారణమంటూ రాంసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదికలో సాధారణ మృతిగా వచ్చింది.

రిపోర్టుపై రాంసింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతడిని చూసిన ఎస్సై సాయికృష్ణ ఓ గదిలోకి తీసుకువెళ్లి సిబ్బందితో కలిసి చితకబాదాడు. బాధితుడి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పీఎస్‌కు రావడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. తీవ్రగాయాలతో ఉన్న రాంసింగ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాంసింగ్ తనపై దాడికి పాల్పడిన ఎస్సై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు.