ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం బస్టాండ్ సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి కిరాణం షాపులో గుట్కా అమ్ముతున్నారని సమాచారంతో ఇల్లందు సిఐ బాతులా సత్యనారాయణ ఆధ్వర్యంలో కిరాణం షాప్ పైన తనిఖీ చేయగా భారీగా గుట్కా నిల్వల్ని గుర్తించి పట్టుకున్నారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తనిఖీలో ఆర్ఆర్ 42 టొబాకో ప్యాకెట్లు, హాయ్ తోబాకో 14 ప్యాకెట్లు, అంబర్లు 5 ప్యాకెట్లు, విమల పాన్ మసాలా 10 ప్యాకెట్లు, జెకే టొబాకో ప్యాకెట్లు 110, వీఐపి టొబాకో 10 ప్యాకెట్లు, పాన్ బహార్ గుట్కా బాక్సులు 9, 1 గుట్కా 15 ప్యాకెట్లు తనిఖీ చేయగా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన అంబర్లు, గుట్కాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంబర్ లను గుట్కాలను స్వాధీన పరుచుకొని సదర్ షాపు యజమాని గుగులోతు శంకర్ ని అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఇట్టి గుట్కాల విలువ సుమారు మార్కెట్లో రూ.30వేల వరకు ఉండటంతో గుట్కాలను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ తనిఖీల్లో ఇల్లందు సీఐతో పాటు ఎస్ఐ సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.