calender_icon.png 10 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్న పోలీసులు

09-01-2025 08:09:34 PM

మునుగోడు (విజయక్రాంతి): రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇండ్ల తాళాలను పగలగొట్టి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, నగదును దొంగిలించిన సంఘటన మండలం పరిధిలోని వడ్డెరిగూడెం గ్రామలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి సమయములో గుర్తు తెలియని దొంగలు నాలుగు ఇండ్ల, ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇండ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనం కొంత నగదును దొంగతనం చేసినట్లు తెలిపారు. బాధితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి తక్షణమే సంఘటన స్థలానికి క్లుస్ టీమ్, డాగ్ స్కాడ్, ఫింగర్ ప్రింట్ అధికారులకు సమాచారం అందజేసి పరిశీలించారు. నల్గొండ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరస్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు.