calender_icon.png 11 April, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు కీలకం

21-03-2025 12:45:47 AM

పోలీసుల ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానం .... ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర అని, కాబట్టి పోలీసులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా మనకి ఏవైనా రోగాలు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతామని చెప్పారు. 

 పోలీసుల ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానం .... ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి శ్రమిస్తారని, వారికి ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించారని కొనియాడారు. అడిగిన వెంటనే వైద్య రంగానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. వనపర్తి జీజీహెచ్ కు, ఎం సి హెచ్ కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వనపర్తి నియోజకవర్గం లోని పెబ్బేరు కు 30 పడకల ఆసుపత్రి, వనపర్తి లో 500 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఉమామహేశ్వర్, సీఐలు, ఎస్త్స్రలు, ఇతర పోలీసు శాఖ సిబ్బంది, వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.