calender_icon.png 18 April, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 నిమిషాల్లో దొంగ పట్టివేత

15-04-2025 05:03:05 PM

చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మంగళవారం స్కూటీ డిక్కీ నుండి నగదు దొంగలించిన వ్యక్తిని కేవలం 40 నిమిషాలలో పోలీసులు దొంగను చాకచక్యంగా పట్టుకొని శభాష్ అనిపించుకున్నారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రానికి చెందిన మీర్ అలీ గాంధీ చౌక్ వద్ద స్కూటీ పార్కింగ్ చేశాడు. స్కూటీ డిక్కీలో ఉన్న 36 వేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తి దొంగలించి పారిపోయాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ ఆధ్వర్యంలో బ్లూ కోర్టు సిబ్బంది తిరుపతి, సాగర్ చోరీ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగను గుర్తించి కేవలం 40 నిమిషాల వ్యవధిలో దొంగను పట్టుకోవడంతో పాటు అతని వద్ద ఉన్న 36 వేల రూపాయలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రవీందర్, ఎస్సై అంజయ్య, బ్లూ కోర్టు సిబ్బంది సాగర్ తిరుపతిని ఎస్పీ డివి శ్రీనివాసరావు, ఏఎస్పి చిత్తరంజన్ అభినందించారు.