calender_icon.png 27 April, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరు సహకారంతోనే కవి యాత్ర విజయవంతం

26-04-2025 06:36:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాహిత్యాన్ని సమాజానికి వివరించేందుకు నిర్వహించిన కవి యాత్ర అందరి సహకారంతో విజయవంతం అవుతుందని కవులు కారంపూడి శంకర్ బి వెంకట్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు లింగన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పెన్షనర్ల భవనంలో కవి యాత్రపై సమీక్ష నిర్వహించి ఖమ్మం నుండి ప్రారంభమైన కవి యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కవులను ఐక్యతను చేస్తూ తెలంగాణ సాహిత్య సంస్కృతిని పరిరక్షించుకునేందుకు దోహద పడిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తి రాబోయే కాలంలో మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు దేవి ప్రియ దశరథ్ నివేదిత ప్రసన్న శ్యాం కుమార్ తదితరులు ఉన్నారు.