23-02-2025 06:46:51 PM
కొండపాక: విబంధ సంసర్గ మర్పడగా విజయదుర్గ పద్య కదంబం ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 25 మంగళవారం ఉంటుందని తెలిపారు. కొండపాక మండలం మర్పడగా గ్రామంలో శ్రీ విజయ దుర్గ సంతాన సామెత మల్లికార్జున స్వామి క్షేత్రంలో విబంధ సంసర్గ పద్య కదంబ ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమాన్నిఈ నెల 25న నిర్వహించనున్నట్లు కృష్ణం వందే జగద్గురు సాహితీ పరిషత్ అధ్యక్షులు, ప్రముఖ కవయిత్రి సరస్వతీ రామ శర్మ, రామంబజే శ్యామలం అధ్యక్షులు సంగీతం నరసింహారావులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా డీఈవో శ్రీనివాసరెడ్డి ని, మున్సిపల్ కమిషనర్ అశ్విత్ కుమార్ లకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 64 మంది కవులు విబంధ సంసర్గ మర్పడగా విజయదుర్గ మకుటంతో రచించిన పద్యాలను పద్య కదంబంగా ప్రచూరించామని తెలిపారు. మర్పడగ క్షేత్రంలో జరగనున్న శివరాత్రి మహోత్సవాలులో భాగంగా విజయదుర్గా మాత చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని దీనికి సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.