12-04-2025 01:05:13 AM
ఫూలే జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో దళిత, బడుగు బలహీనర్గాలకు విద్య, వైద్యం అందకుండా పోయే పరిస్థితి దాపురించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పాలకుల నిర్ల క్ష్యం మూలంగా వేలాది కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చదువు కునే ప్రతి విద్యార్ధికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాం గ్రెస్ వాటిని గాలికొదిలేసిందన్నారు.
దళిత, బహుజన, అగ్రవర్ణ పేదల జీవితాల్లో అక్షర వెలుగులు నింపేందుకు తన జీవితాన్నే త్యా గం చేసిన ఫూలే ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ చెల్లించి విద్యార్థుల ఉన్నత చదువులకు ఢోకా లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు, బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, కోశాధికారి శాంతకుమార్, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులున్నారు.