06-03-2025 12:00:00 AM
మహబూబ్ నగర్, మార్చి 5 (విజయ క్రాంతి) : నేషనల్ హైవే.. జర జాగ్రత్త.. నిత్యం ప్రమాదాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి.. వాహన చదువులు ఆచితూచి తమ ప్రయాణాలను కొనసాగించాలి.. ఈ నిబంధనలు పోలీస్ అధికారు లతో పాటు ఉన్నత అధికారులు అందరూ వాహన చోదకులు సైతం చెబుతున్న వాస్తవ మాట.
కాగా ఇక్కడ బాలనగర్ సమీపంలోని టోల్ ప్లాజా నుంచి జడ్చర్ల వరకు ఉన్న నేషనల్ హైవే 44 పై సదుపాయాలు కల్పించ వలసిన నిర్వాహకులు ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ లలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకులలో నిత్యం వాటర్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలి. కాగా సంబంధిత నిర్వాహకులు అవేమి పట్టించుకోవడం లేదు.
అసలే వేసవి ఆపై నేషనల్ హైవే పై సుదూర ప్రాంతాల నుంచి వాహన చోదకులు తమ వాహనాలను నడుపుకుంటూ వస్తుంటారు. నిద్ర వచ్చిన.. కాస్త విశ్రాంతి తీసుకొని.. మొహాలు శుభ్రం చేసుకునేందుకు కూడా బస్ షెల్టర్లలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులలో నీటి టి చుక్క కనిపించడం లేదు.
నెలల తరబడి ట్యాంకులలో నీళ్లు ఉండకపోవడంతో పాటు ఆ వాటర్ ట్యాంకులకు ఉన్న నల్లాలు సైతం విరిగిపోయి కనిపిస్తున్నాయి. చేసేదేం లేక వాహన చోదకులు ఆయా బస్సు షెల్టర్ల దగ్గ ర వాహనాలు ఆపినప్పటికీ వాటర్ ట్యాంకులలో నీరు ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బం దులకు ఎదుర్కొంటున్నారు.
స్పందించాల్సిన అధికారులు అదే రోడ్డుపై పరుగులు పెడుతున్న సంబంధిత నిర్వాహకులకు మా త్రం నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించకపోవడంతో నిర్వాహకులు సైతం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధ్యాస అంతా టోల్ వసూల్ పైనే
నిర్వాహకులు కేవలం వారి ధ్యాసంతా టోల్ వసూల్ పైనే కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనా అంటే ప్రభుత్వం నిబంధన ప్రకారం నడుచుకుంటున్నాము అంటున్న నిర్వాకులు నేషనల్ హైవేపై ప్రభుత్వం నిబంధనల మేరకు కల్పించాల్సిన సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని వాహన చోటుకులు అసాన వ్యక్తం చేస్తుండ్రు.
ప్రభుత్వం వాహన చోదకులకు నేషనల్ హైవే 44 పై అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి ఉంచాలని పలు నిబంధనలు ఉన్నప్పటికీ నిర్వాహకులు కేవలం టోల్ ప్లాజా పైన దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. టోల్ ప్లాజా మొదలుకొని జడ్చర్ల వరకు ఉన్న బస్ షెల్టర్ల దగ్గర వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని మరమ్మతు చేసి నీటిని మాత్రం ఉంచడం లేదు.
టోల్ ప్లాస్ దగ్గర వాహన చోదకుల నుంచి ముక్కు పిండి తోలు వసూలు చేస్తున్న నిర్వాహకులు సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నిలిపి అధికారులను అడుగుదామనుకున్న మనకెందుకులే చూ ద్దాం ? అనుకుంటూ వాహన చదువులు తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.
సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వేసవికాలంలోనైనా కనీసం హైవే పై ఉన్న బస్ షెల్టర్ల దగ్గర ఉన్న మినీ వాటర్ ట్యాంకులలో నీటి సదుపాయం కల్పించాలని కోరుతుండ్రు.
ఎవరు ఎవరిని అడుగుతారు..?
నేషనల్ హైవే పై వాహన చోదకులు వారి ప్రయాణాలను కొనసాగించినప్పటికీ సదుపాయాలు కల్పనలో నిర్వాకులు నిర్లక్ష్యం వహించిన ప్రశ్నించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు..? ఎందుకు సమయం వృధా చేసుకోవాలి..? మనం అడిగిన సదుపాయాలు కల్పిస్తారో లేదో తెలియదు..?
గంట, అరగంట, రెండు గంటలు ఇలా కేవలం గంటల పరిధిలోనే ప్రయాణాలను కొనసాగిస్తాం ఎక్కడో ఒకచోట హోటల్ దగ్గర ఆపుకొని అక్కడ ఉన్న సదుపాయాలను ఉపయోగించుకునే ముందుకు సాగితే సరిపోతుందని సరిపెట్టుకుంటుండ్రు. దీంతో నేషనల్ హైవే నిర్వాహకులు మాత్రం దూరంగా ఉంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులను ఆదేశించి అవసరమైన సదుపాయాలు కల్పించి బస్సు షెల్టర్లు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నీటి సదుపాయాన్ని కల్పించాలని వాహన చోదకులు కోరుతున్నారు.
నల్లాలు విరగ్గొడుతుండ్రు...
బస్సు సెంటర్ ల దగ్గర ఉన్న మినీ వాటర్ ట్యాంకులర్‌లో నీటి సదుపాయం ఉంచినప్పటికీ నల్లాలను విరగగొడుతుండ్రు. ఎన్నోమార్లు రిపేరు చేసి నీటిని అందుబాటులోకి ఉంచాం. తక్కువ సమయంలోనే నల్లాలను విరగ్గొట్టి నీరు వృధా పోయేలా చేస్తుండ్రు. పూర్తిస్థాయిలో పరిశీలించి బస్ షెల్టర్లలోని మినీ వాటర్ ట్యాంకులలో నీరు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎల్లప్పుడూ పర్యవేక్షణ చేస్తాం.
మహమ్మద్ ఇబ్రహీం, ఎక్స్‌ప్రెస్ హైవే జనరల్ మేనేజర్,
ఎన్‌హెచ్ 44 బాలనగర్ సమీపంలో టోల్ గేట్ నిర్వాహకులు