calender_icon.png 12 March, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 18న వస్తున్న చౌర్య పాఠం

12-03-2025 12:00:00 AM

త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘కార్తికేయ -2’ వంటి చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి చూడమణి సహ నిర్మాత. ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.

లీడ్ యాక్టర్స్ వారి ముఖాలను రహస్యంగా కప్పి ఉంచిన రిలీజ్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతుంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కథను రాశారు.