calender_icon.png 25 December, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగీత శిఖరమా వందనం!

25-12-2024 01:29:35 AM

మహమ్మద్ రఫీ శత జయంతి  ప్రత్యేకం 

తరతరాలు మర్చిపోలేని మధుర గీతాలెన్నో సంగీత ప్రపంచానికి అందించిన మహమ్మద్ రఫీ.. బాల్యం నుంచే స్వరయాగం చేసిన కళాకారుడు. ౧౯౨౪, డిసెంబర్ ౨౪న జన్మించిన ఆయన ౧౯౮౦, జూలై ౩౧న కాలం చేశారు. రఫీ శత జయంతి సంవత్సరం మంగళవారం ఆరంభమైంది. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని.. 

మహమ్మద్ రఫీ పంజాబ్‌లోని కోట్లా సుల్తాన్‌సింగ్ గ్రామంలో పుట్టారాయన. హజీ అలీ, అల్లారఖీ బాయి దంపతుల ఆరుగురు సంతానంలో ఐదోవాడు. ఎనిమిదేళ్ల వయసులో ఓ ఫకీరు పాట రఫీని ఆకట్టుకుంది. భిక్షం కోసం ఇల్లిల్లు తిరుగుతున్న ఫకీరు గొంతులో నుంచి జాలువారుతున్న గీతాలకు మంత్రముగ్ధుడై తన్మయత్వంతో సంగీత సాగరంలో ఓలలాడాడు. తర్వాత ఇలా రోజూ అదే తంతుగా మారింది. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో తండ్రికి అర్థం కాలేదు.

ఓ రోజు తన తండ్రి దుకాణానికి వెళ్లి, ఫకీరు పాడిన పాటలను శ్రావ్యంగా పాడటం ప్రారంభించాడు. తండ్రి పులకించిపోయాడు.. చుట్టూ చేరినవారంతా ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి నుంచి అంగట్లోని వారంతా రఫీ రాకకోసం ఎదురుచూసేవాళ్లు. అలా పదేళ్లు కూడా రాకుండానే తన గాత్రంతో ఆబాలగోపాలన్నీ పరవశింపజేశారు రఫీ. రఫీకి పదకొండేళ్ల వయసులో అతని తండ్రి కోట్లా నుంచి లాహోర్‌కు మకాం మార్చారు. హిందుస్థానీ సంగీతానికి లాహోర్ వీధులు కాణాచిగా అలరారుతున్న రోజులవి.

అప్పటికే రఫీలోని గాయకుడిని నిశితంగా పరిశీలించాడు రఫీ పెద్దన్నయ్య స్నేహితుడు అబ్దుల్ హమీద్. ఆయనే ఈ బాలగాయకుణ్ని ఆ సంగీత విద్వాంసులకు పరిచయం చేశారు. అలా మహామహుల దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించారు రఫీ. 

కరెంటు పోయిన క్షణాన వెలుగులోకి.. 

లాహోర్‌లో ఓరోజు కేఎల్ సైగల్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముంబయి నుంచి సైగల్ అక్కడికి చేరుకున్నారు. కచేరీ రెండు గంటల్లో మొదలవుతుందనగా కరెంటు పోయింది. అక్కడి జనంలో రఫీ, హమీద్ ఉన్నారు. ‘నా స్నేహితుడి తమ్ముడు అద్భుతంగా పాడతాడు. సైగల్ సాబ్ వచ్చే దాకా.. అతణ్ని పాడనివ్వండి. ప్రజలు కూడా నెమ్మదిస్తారు’ అన్నాడు హమీద్ వేదికపైకెక్కి. నిర్వాహకులు అనుమతించారు.

ఆ యువ గాయకుడు గొంతెత్తాడు. ఎప్పుడూ వినని మాధుర్యంతో అందరిలో ఏదో తన్మయత్వం పూనింది. రఫీ గాత్రం మాత్రం లాహోర్ గాలిలో ఝుమ్మంటూ వీచింది. కరెంటు వచ్చిన తర్వాత రఫీ వేదిక దిగి వెళ్లిపోయాడు. సైగల్ పాటలను వింటూ ఉన్నాడు. రఫీ గాత్రాన్ని అప్పుడే విన్న బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్యామ్‌సుందర్.. అతని అడ్రస్ తీసుకొని వెళ్లిపోయాడు. మూడేండ్లు తర్వాత 1942లో శ్యామ్‌సుందర్ నుంచి రఫీకి పిలుపు వచ్చింది. ఆయన సంగీత సారథ్యం వహించిన పంజాబీ చిత్రం ‘గుల్ బలోజ్’ సినిమాలో రఫీతో ఓ పాట పాడించారు. 

ఒక్కో హీరోకు ఒక్కోలా పాడుతూ.. 

1944లో రఫీ, హహీద్ ముంబయి చేరారు. శ్యామ్‌సుందర్‌ను కలిశారు. అతనే హిందీలోనూ రఫీకి మొదటి అవకాశం ఇచ్చారు. ‘గావ్‌ఁ కీ గోరీ’ సినిమాలో పాట పాడించాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కోరస్ సింగర్‌గా ప్రతిభ చాటుకుంటూనే.. లీడ్ గాయకుడిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు రఫీ.

తర్వాత అవకాశాలు పొందిన ఆయన ఎస్డీ బర్మన్, రాజేశ్ రోషన్, ఖయ్యాం, జయదేవ్, సీ రామచంద్ర, చిత్రగుప్త, ఆర్డీ బర్మన్, శంకర్-జైకిషన్, కళ్యాణ్ జీ- ఆనంద్ జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం ఇలా 1950 నుంచి 1980 వరకు ఎందరెందరో సంగీత దర్శకులకు మేలి రత్నాల్లాంటి పాటలు అందించారు. రేడియోలో రఫీ పాట వస్తుంటే.. శ్రోతలు అది ఏ హీరో మీద పిక్చరైజ్ చేసిందో చెప్పేసేటంతగా ఉండేది రఫీ వాయిస్. రఫీ గొంతుతో హిట్టయిన పాటలే కాదు, హీరోలూ ఉన్నారు. 

తెలుగులోనూ కొన్ని... 

హిందీ, పంజాబీ, మరాఠీ తదితర భాషల్లో వేల పాటలు పాడిన రఫీ తెలుగులోనూ కొన్ని గీతాలు ఆలపించారు. అవన్నీ సూపర్‌హిట్ జాబితాలో చేరిపోయాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘భలేతమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారు గానీ వేదాంతులైన గానీ..’, ‘ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే..’, ‘గోపాల బాల నిన్నే కోరి..’ పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమాలో ‘నా మది నిన్ను పిలిచింది గానమై..’ పాట ఈ తరాన్నీ మురిపిస్తుంది. ‘అక్బర్ సలీం అనార్కలీ’ సినిమాలోని ‘సిపాయి నీకై ఎంత ఎంత వేచి ఉన్నానో..’ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.   

రఫీ పాపులర్ పాటల్లో కొన్ని.. 

పాట సినిమా

సుహానీ రాత్ దులారీ

ఛూలేనే దో నాజుక్ కాజల్

మధుబన్ మే కోహినూర్

జోవాదా కియా.. తాజ్‌మహల్

ఖొయాఖొయా చాంద్ కాలాబాజార్

చౌద్‌వీ కా చాంద్ చౌద్‌వీ కా చాంద్

బహారో ఫూల్ బర్సావో సూరజ్

దిల్ కా భవర్ తేరే ఘర్ కే సామ్‌నే

దేఖో రుఠా నా.. తేరే ఘర్ కే సామ్‌నే

చాహె కోయీ ముఝే జంగ్‌లీ

దీవానా హువా కాశ్మీర్ కీ కలీ

ఆజా ఆజా మే తీస్రీ మంజిల్

దిల్ తేరా దివానా దిల్ తేరా దివానా

చురా లియా హై యాదోఁ కీ బారాత్

ఓ హసీనా తీస్రీ మంజిల్

క్యా హువా తేరా హమ్ కిసీసే కమ్ నహీ

తేరీ బిందియా రే అభిమాన్

ఆజ్ కల్ తేరే బ్రహ్మచారి

డఫ్‌లీ వాలే సర్గమ్

తుఝే జీవన్ కీ డోర్ అస్లీ-నక్లీ

బాగోఁమే బహార్ హై ఆరాధన

గున్ గునా రహా ఆరాధన

యే రేష్మీ జుల్ఫే దో రాస్తే

ఛల్కాయేజామ్ మేరే హమ్‌దమ్ మేరే దోస్త్

ని సుల్తానా రే.. ప్యార్ కా మౌసమ్

నైన్ లడ్ జయి.. గంగా జమునా

అభీ నా జావో హమ్ దోనో

పుకార్తా చలా మేరే సనమ్

లే గయి దిల్ లవ్ ఇన్ టోక్యో

ప్రేమ్ పత్ పడ్‌కర్ సంగమ్

ఇశారో ఇశారో మే కాశ్మీర్ కీ కలీ

వాదా కర్‌లే హాత్ కీ సఫాయీ

యేఁ మౌసమ్ ధర్తీ

లాఖోఁ హై కిస్మత్

దీవానా ముఝ్‌సా తీస్రీ మంజిల్

బేఖుదీ మే సనమ్ హసీనా మాన్ జాయేగీ

యే జో చిల్‌మన్ హే మెహబూబ్ కీ మెహందీ

ముఝే తేరే ఆప్ ఆయే బహార్ ఆయీ

దిల్ ఉసే దో అందాజ్

ఏక్ ఘర్ తేరే ఘర్ కే సామ్నే

ఏక్ డాల్ పర్ చోర్ మచాయే షోర్

తేరీ ప్యారీ ప్యారీ ససురాల్

సర్ పర్ టోపి తుమ్‌సా నహీ దేఖా

ఆజా తుఝ్‌కో నీల్‌కమల్

లిఖే జో ఖత్ తుఝే కన్యాదాన్

పత్తర్ కే సనమ్ పత్తర్ కే సనమ్

మై కాలే హైతో గుమ్‌నామ్

యూతో హమ్‌నే తుమ్‌సా నహీ దేఖా

తేరీ దునియా జబక్