calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం

12-04-2025 08:07:37 PM

శీలం సైదులు యాదవ్..

మోతే: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో తిరిగి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మోతే బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మోతే మండల పరిధిలోని సర్వారం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు ఇంట్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ మోతే మండల  సన్నాహక సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ నాయకత్వంలో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభకు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో మోతే మండలం నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు జానీ పాషా, మండల నాయకులు గుగులోతు శంకర్ నాయక్, మైనంపాటి శ్రీనివాస్ రెడ్డి, పల్స మాల్సుర్, మిక్కిలినేని సతీష్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.