calender_icon.png 29 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వద్దిరాజు రవిచంద్ర వెంట కదిలిన గులాబీ దండు

28-04-2025 12:06:45 AM

ఖమ్మం, ఏప్రిల్ 27( విజయక్రాంతి ):-బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,కందాళ ఉపేందర్ రెడ్డి,కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతిలతో కలిసి ఖమ్మం తెలంగాణ భవన్ లో ఆదివారం ఉదయం గులాబీ జెండాను ఆవిష్కరించి ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో వాహనాలు వెంట రాగా బయలుదేరారు.

ఈ సందర్భంగా వారంతా గులాబీ కండువాలు ధరించి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి ‘జై తెలంగా ణ జైజై తెలంగాణ‘,‘జిందాబాద్ జిందాబాద్ బీఆర్‌ఎస్ జిందాబాద్‘,‘వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి కేసీఆర్  నాయకత్వం వర్థిల్లాలి‘,‘జోహార్లు జో హార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు‘అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

అలా గే, మార్గమధ్యంలో వారు పాలేరు నియోజకవర్గంలోని పెద్ద తండా,పిండిప్రోలు తదితర చోట్ల బీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించా రు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఉప్ప ల వెంకటరమణ,గుండ్లపల్లి శేషగిరిరావు, తోట వీరభద్రం తదితరులు ఉన్నారు.