16-04-2025 01:02:48 AM
ఇల్లెందు, (విజయక్రాంతి):భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు దండు లా కదిలి వచ్చి విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లందు పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్ లో బారాస నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అధ్యక్షతన నిర్వహించారు. వరంగల్ లో ఈనెల 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలు అంబురానంటరనున్నాయని ఈ వేడుకల్లో తెలంగాణ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తూ చేతకాని పాలన చేస్తున్నారని ప్రజలు విస్తు పోయారని, రజతోత్సవ సభలో కెసిఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. నియోజ కవర్గంలోని ప్రతి మండలం నుంచి 500 మంది సభకు తరలివచ్చేలా నాయకులు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన తలోగ్గేది లేదని భవిష్యత్తు బారాసదే అని స్పష్టం చేశారు. పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ..
2001 లో ఆవిర్భవించిన పార్టీ మొక్కవోని దీక్షతో ఏర్పడిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం సభకు తరలి రావాల న్నారు. పండుగలను మరిపించే విధంగా సిద్దమవ్వాలన్నారు. గులాబీ జెండాను గుండెకు అడ్డుకొని బస్సెక్కాలన్నారు. చిన్న పొరపాటుతో ఎగిరి బయట పడ్డామని, ఇక మళ్ళీ ఇరువై ఏళ్ల వరకు కాంగ్రెస్ కనపడదని జోస్యం చెప్పారు. గ్యారంటీ కార్డు, తులం బంగారం ఏమైందని ప్రశ్నిశించారు. ఏ ఎన్నికలు వచ్చిన గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఇప్పుడు జరిగే అరాచకాలపై పింక్ బుక్ లో రాసుకుంటున్న, ఎవరినీ వదలమని హెచ్చరించారు. సభకు ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదన్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని, ఏమిజ రిగిన ఫోన్ నెంబర్తో వివరం తెలిపితే పింక్ బుక్ లో రాసుకుంటానని వివరించారు.
ఈ సందర్బంగా ఆవిర్భావ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, డీసీసిబి డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు, నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, ఏఎంసి మాజీ చైర్మన్ బానోత్ హరిసింగ్, సిలువేరు సత్యనారాయణ, నెమలి ధనలక్ష్మి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, ఇల్లెందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, కే. రేణుక, జెకె శ్రీను, గార్ల కార్యదర్శి రాధాకృష్ణ, కామేపల్లి, బయ్యారం మండలాల నాయకులు పాల్గొన్నారు.