calender_icon.png 28 April, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్కతుర్తికి తరలిన గులాబీ దండు..!

28-04-2025 01:25:19 AM

  1. ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఓరుగల్లుకు
  2. ప్రతీ నియోజకవర్గం నుంచి 3 వేల మంది

సంగారెడ్డి, ఏప్రిల్ 27(విజయక్రాంతి) : ఓరుగల్లులో నిర్వహించిన బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు తరలివెళ్ళారు. తెలంగాణకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను నేతలు తరలించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించిన బహిరంగ సభకు అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాది వాహనా ల్లో వెళ్ళారు.

పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీలతో సమావేశం నిర్వహించి రజతోత్సవ సభకు సర్వసన్నద్ధం చేయాలని దిశాని ర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు గత పదిహేను రోజుల నుండే ప్రణాళికలు సిద్ధం చేశారు.  ప్రచారంలో భాగంగా గోడ రాత లు, పోస్టర్లు ఆవిష్కరించారు. గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకొని జన సమీకరణకు కృషి చేశారు. 

నియోజకవర్గానికి 3-4 వేల మంది...

ఉమ్మడి జిల్లాలో ప్రతీ నియోజకవర్గం నుంచి సుమారుగా 3--4వేల మంది కార్యకర్తలు, అభిమానులను తరలించారు. వీరంద రిని తరలించడానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. సభకు తరలి వెళ్ళిన వారికి తాగునీరు, మజ్జిగ, భోజన వసతి కల్పించారు. బాధ్యతనంతా ఆయా మండ ల, గ్రామాల ఇంచార్జిలు పర్యవేక్షించారు.

పటాన్‌చెరు, ఏప్రిల్ 27 : బీఆర్‌ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న రజోత్సవ సభకు పటాన్ చెరు నియోజవకర్గం నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్త లు ఆదివారం భారీగా తరలివెళ్లారు.

పటాన్ చెరు బీఆర్‌ఎస్ నియోజవకర్గ సమన్వయ కర్త ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కొలను బాల్ రెడ్డి, వెంకటేశంగౌడ్, గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదలతో పాటు బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు వరంగల్ సభకు వాహనాలలో భారీగా తరలివెళ్లారు.

ఈ సందర్భం గా ఆయా మండలాలు, గ్రామాలు, పట్టణాలలో బీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించా రు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ప్రజలు టీవీలకు అత్తుకుపోయారు. పార్టీ మండల, గ్రామ అధ్యక్షులతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వరంగల్ సభకు వెళ్లారు. వరంగల్ సభకు బయలు దేరిన వాహనాలతో రింగు రోడ్డు, జాతీయ రహదారి గులాబీ మయంగా మారింది.

జగదేవపూర్, ఏప్రిల్ 27: అధికారంలో ఉన్న లేకపోయినా బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల ప్రక్షణ నిలుస్తుందనీ జగదేవపూర్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరించి మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత బిఆర్‌ఎస్‌కే  దక్కిందన్నారు.

నేటికీ 25వ సంవ త్సరంతో రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా వరంగల్ గడ్డ మీద భారీ బహిరంగ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మాజీ సీఎం గజ్వేల్ గడ్డ ము ద్దు బిడ్డ కెసిఆర్ పిలుపుమేరకు రామ దండుల మండల వ్యాప్తం గా కార్యకర్తలు కదం తొక్కారని తెలిపారు.

కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇక్బాల్, కొండ పోచమ్మ మాజీ డైరెక్టర్ కుమ్మరి కనుకయ్య, సీనియర్ నాయకులు మహేష్, మచ్చ బాబు,కళ్యాణ్ కిషోర్ గౌడ్, బచ్చలి భాస్కర్ పాల్గొన్నారు.