గోదావరి నదిలో మునిగిన యాత్రికులు
భద్రాచలం, అక్టోబర్ 18: స్నానానికి దిగి లోతు తెలియక గోదావరిలో మునిగిపోతున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని స్థానిక ఫొటోగ్రాఫర్ కాపాడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం చోటుచేసుకొంది. ఇల్లెందుకు చెందిన ఒకే కుటుంబానికి ఆరుగురు స్వామివారి దర్శనానికి భధ్రాచలం వచ్చారు. దర్శనానికి ముందు స్నానం చేయడానికి గోదావరిలోకి దిగారు.
ఈ క్రమంలో లోపలికి వెళ్లడంతో నీటి ప్రవాహానికి గోదావరిలో ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలు కొట్టుకు పోతుండగా ఒడ్డున ఉన్న ఫొటోగ్రాఫర్ లక్ష్మణ్‌రావు నదిలోకి దిగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమలో ఆయన కెమారాలు నీళ్లలో తడిచి పోయాయి. పలువురి ప్రాణాలను కాపాడిన ఫొటోగ్రాఫర్‌ను స్థానికులు, భక్తులు అభనందించారు.