నల్లబ్యాడ్జీలతో రైతుల నిరసన
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 4 గ్రామాల రైతులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరిగి గ్రీన్ ఫార్మాసిటీ అని పేరును మార్చి మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గతంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తే గుంట భూమి కూడా తీసుకోబోమని మాట ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కానమోని గణేశ్, సామ నిరంజన్, మహిపాల్, అనసూయమ్మ, కొం డ్రెడ్డి అచ్చిరెడ్డి, కొండల్ రెడ్డి, బొడ్డు సందీప్, నర్సింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.