ముంబై, నవంబర్ 12: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామని బెది రింపులకు గురి చేసిన వ్యక్తిని ముంబై పోలీ సులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన లాయర్ ఫైజాన్ ఖాన్‌ను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. గత వారం కింద షారూఖ్‌ను చంపేస్తామని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా మంగళవారం పోలీసులు ఫైజాన్ ఖాన్ అనే లాయర్‌ను అరెస్ట్ చేశారు. కానీ తాను ఆ బెదిరింపు కాల్ చేయలేదని అప్పు డు తన మొబైల్ ఫోన్ దొంగతనం చేశారని లాయర్ వాపో యాడు. తదుపరి విచారణ సం పోలీసులు ఆ లాయర్‌ను ముంబైకి తరలించారు.
50 లక్షలు ఇవ్వలేదో...
నవంబర్ 7న ఈ బెదిరింపు కాల్ వచ్చిం ది. ‘యాక్టర్ షారుఖ్ ఖాన్ రూ. 50 లక్షలు కనుక ఇవ్వకపోతే అతడిని చంపేస్తాం’ అని దుండగులు బెదిరించినట్లు పోలీస్ కానిస్టే బుల్ సంతోష్ గోడ్కే తెలిపారు.