16-04-2025 12:00:00 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గోపాలపేట ఏప్రిల్ 15: తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల రజతోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బిజెపి కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు.
పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకున్న ముఖ్యమంత్రి కేవలం 600 కోట్లు ఖర్చు పెడితే 12 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా సాగునీటిని ఇవ్వొచ్చని అన్నారు. నిధులు ఖర్చు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటులో నిబంధనలు పాటించకుండా. కాంగ్రెస్ పార్టీ ఆర్ బాటన్ చేస్తుందని తెలిపారు. మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలంటే.
ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి తుది నోటిఫికేషన్ తర్వాత చేయాలని ఈ నిబంధనలు పాటించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు కరెంటు కోతలు. రుణమాఫీ లేదని సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
మహిళలకు 2800, కళ్యాణ లక్ష్మి పథకం లో తులం బంగారం, రైతు కూలీలకు 12000 అని ఆయన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని అన్నారు. భూముల ధరలు సగానికి పడిపోయాయని జీవనోదారం కోల్పోయి రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండల అధ్యక్షుడు బాలరాజు మాజీ ఎంపీపీ సంధ్యా తిరుపతి యాదవ్ మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ నాయకులు శేఖర్ తిరుపతిరెడ్డి సునీల్ శ్రీనివాసులు రాజేష్ గౌడ్ శ్రీధర్ రావు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.