calender_icon.png 22 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

15-10-2024 12:00:00 AM

సిరిసిల్ల, అక్టోబర్ 14: బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. గాంధీనగర్‌కు చెందిన వొటకారి మధు ఇల్లు నిర్మించుకుందామను కున్నాడు. గాంధీనగర్‌కే చెందిన కొండ్లెపు ముత్యం ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి ఇప్పిస్తానని నమ్మించి రూ.59 వేలు తీసుకున్నాడు.

ఎంతకీ అనుమతి ఇప్పించకపోవ డంతో మధు మున్సిపల్ కార్యాలయ నుంచి అనుమతి తీసుకుని ఇంటి పనులు మొదలు పెట్టాడు. ఆ తర్వాత ముత్యం వెళ్లి రూ.రెండు లక్షలు ఇవ్వాలని, లేదంటే ఇల్లు కట్టనివ్వనని మధును, కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.

దీంతో మధు భయపడి రూ.50 వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు కూడా ఇవ్వాలని బెదిరిస్తుండటంతో మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం పోలీసులు ముత్యంపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.