calender_icon.png 3 February, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్రలోనే మృత్యు ఒడిలోకి..

03-02-2025 08:42:05 PM

చేవెళ్ల: రోజులానే రాత్రి భోజనం తినేసి పడుకున్న ఓ వ్యక్తి నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలోని బాకారంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం బాకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (30) ఎప్పటిలాగే ఆదివారం రాత్రి తన భార్యతో కలిసి భోజనం చేశాడు. కొద్దిసేపటికి పడుకున్నాడు. కానీ మళ్లీ లేవలేదు. సోమవారం ఉదయం శ్రీకాంత్ గౌడ్ ఆయన భార్య నిద్రలేపేందుకు ప్రయత్నించిగా ఎలాంటి కదలికలు లేకపోవడంతో బంధువుల సాయంతో దగ్గరలో ఉన్న భాస్కర ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డ్యూటీ డాక్టర్లు నిర్దారించారు. శ్రీకాంత్ తరుచూ కడుపు నొప్పితో బాధపడేవారని మృతుని భార్య సారా శిరీష ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.