calender_icon.png 5 October, 2024 | 4:44 PM

ఆవర్తనం ప్రభావం ఐదు రోజులు వాన

05-10-2024 02:22:01 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): దక్షిణ, మధ్య బంగాళా ఖా తం వద్ద ఎగువ గాలులతో ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని పేర్కొన్నది. దీని వల్ల రాష్ట్రం లో ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భా రీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు ఐదు రో జులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.