calender_icon.png 27 April, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా డ్యూటీలు మా ఇష్టం నచ్చినప్పుడు వస్తాం.. నచ్చినప్పుడు వెళ్తాం..

26-04-2025 04:56:31 PM

మా డ్యూటీ షిఫ్ట్లు మేమే వేసుకుంటాం..

మమ్మల్ని అడిగేది ఎవరు? ఆపేదెవ్వరు?

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో వైద్య సిబ్బంది పనితీరు దారుణంగా ఉందని క్షయ వ్యాధి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో గల క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో ఆపరిశుభ్రత తాండవిస్తుందని, ఇక్కడ పనిచేసే నర్సులు వారి డ్యూటీలు వారే వేసుకుంటూ, ఒక్కొక్క షిఫ్ట్ లో కేవలం గంట డ్యూటీ మాత్రమే చేస్తున్నారు. రోగులకు ఇంజక్షన్లు ఇచ్చి అక్కడ ఉండకుండా, పేషంట్లకు ఏదైనా అవసరమైతే చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో మరుగుదొడ్ల పరిస్థితి చూస్తే మరి దరిద్రంగా ఉన్నాయి. 

ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ క్షయ వ్యాధి పేషెంట్లకు సరైన వైద్యం అందిస్తూ వారికి మనోధైర్యాన్ని నింపాలని, వారి వెంట ఉంటూ వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఆస్పత్రుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి డాక్టర్లను, నర్సులను నియమిస్తే క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలవడుతున్నాయి. పక్కనే ఉన్న ఐటీడీఏ  ఉన్న క్షయ వ్యాధి నివారణ కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వైద్య సిబ్బంది పని తీరుపై విచారణ జరిపి క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో నర్సులు ,డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.