calender_icon.png 28 November, 2024 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే ప్రజలే తిరగబడతరు

27-10-2024 01:08:29 AM

  1. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
  2. భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ప్రజాచైతన్య పాదయాత్ర

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే ప్రజలు తిరగబడతరని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. మూసీ నది హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమని, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతుల మేలు కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న మూసీ పునరుజ్జీవం కార్య క్రమానికి ఎవరు అడ్డుపడినా ప్రజల నుంచి వారికి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.

భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంత రైతులు, కూలీలతో కలిసి మూసీ పునరుజ్జీవ కార్యక్ర మానికి మద్దతుగా శనివారం ప్రజాచైతన్య పాదయాత్ర నిర్వహించారు. పోచంపల్లి మండలం పిల్లాయపల్లి నుంచి ఘట్‌కేసర్ మండల సరిహద్దు మక్త అనంతారం వరకు జరిగిన పాదయాత్రలో ఎంపీ చామల, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామ్యేల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు మూసీ కాలుష్య కష్టాలు తీర్చడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీ అయ్య కేసీఆర్ కాళేశ్వరం కట్టినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నాడని కేటీఆర్‌ను ప్ర శ్నించారు.

డీపీఆర్‌లు లేకుండా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడన్నారు. కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ గంగానదిని ప్రక్షాళన చేస్తే గొప్ప పని అయితే, ఇక్కడ మూసీ ప్రక్షాళన చేస్తే ఎలా తప్పువుతుందని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

అనంతరం ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నది పున రుజ్జీవనానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు.